అసలు నోట్లు తీసుకుని నకిలీ నోట్ల అందజేత

– హవాలా కేసును ఛేదించిన నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్సు పోలీసులు
– నలుగురు నిందితుల అరెస్టు
– రూ.72లక్షల స్వాధీనం
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఒర్జినల్‌ నోట్లు తీసుకుని నకిలీ నోట్లు అందిస్తున్న ముఠాలోని నలుగురు నిందితులను నార్త్‌జోన్‌ టాస్క్‌ఫో ర్సు పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.72 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. బుధవారం బషీర్‌బాగ్‌లోని ఓల్డ్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ రాధాక షన్‌రావుతో కలిసి అదనపు సీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ వివరాలను వెల్లడించారు. రాజస్థాన్‌కు చెందిన కన్హయ్యా లాల్‌ అలియాజ్‌ జతిన్‌, అదే రాష్ట్రానికి చెందిన రమావ తర్‌ శర్మా అలియాజ్‌ మోహన్‌, భరత్‌కుమార్‌, రామక్రిష్ణా శర్మలు వివిధ వ్యాపారాలు చేస్తున్నారు. అయితే అందులో ఆశించిన తీరులో సంపాదన లేకపోవడంతో హవాల దందాపై దృష్టి సారించారు. ముంబారు, ఢిల్లీ, కల్‌కత్తా తోపాటు ఇతర రాష్ట్రాలల్లో హవాలా రూపంలో డబ్బులు సరఫరా చేస్తున్నారు. అయితే ఇందులోనూ ఆశించిన తీరులో సంపాదన లేకపోవడంతో నకిలీ నోట్లపై దృష్టి సారించారు. ఈ ముఠా ఒర్జినల్‌ నోట్లు తీసుకుని బాధితులకు మాత్రం కలర్‌ జిరాక్స్‌ తీసిన నకిలీ నోట్లను అందిస్తున్నారు. ఇదే తరహాలో ఢిల్లిల్లో ఓ వ్యక్తి నుంచి దాదాపు రూ.80లక్షలు ఒర్జినల్‌ నోట్స్‌ను తీసుకున్నారు. వాటిని హవాలా రూపంలో మాదాపూర్‌లో ‘ఐకాన్‌ టెక్నాలేజీస్‌ ఇండియా ప్రయివేటు లిమిటెడ్‌’కు అందించా ల్సి ఉంది. అయితే ఒర్జినల్‌కు బదులుగా నకిలీ నోట్లను గత నెల 28న నాంపల్లిలో ఆ సంస్థ ప్రతినిధులకు అందించారు. ఆలస్యంగా గమనించిన వారు నకిలీ నోట్లగా గుర్తించారు. వెంటనే నిందితులకు ఫోన్లు చేయ డంతో స్విచ్ఛాఫ్‌గా వచ్చాయి. మోసపోయినట్టు గుర్తిం చిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీసీపీ రాధాకిషన్‌రావు ఆదేశాలతో విచారణ చేపట్టిన సీఐ టీ.శ్రీనాథ్‌రెడ్డి అన్ని కోణాల్లో విచారించారు. టాస్క్‌ఫోర్సు ఎస్‌ఐ బీ.అశోక్‌రెడ్డితోపాటు కే.శ్రీకాంత్‌, ఎం.అనంత చారి, బీ.అరవింద్‌ గౌడ్‌ కలిసి నిందితులను అరెస్టు చేశారు. నగరంలో సంచలనం రేపిన హవాలా కేసును ఛేదించినందుకు అదనపు సీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ టాస్క్‌ఫోర్సు పోలీసులను ప్రత్యేకంగా అభినందించారు.