ఆరోగ్యానికి ప్రమాదం

మారుతున్న పరిస్థితుల వల్ల ప్రతి ఒక్కరూ ప్యాకెజ్డ్‌ ఫుడ్‌పై ఆధారపడాల్సి వస్తుంది. ప్రయాణ సమయంలో లేదా స్నాక్స్‌ తినడానికి కచ్చితంగా ప్యాకెజ్డ్‌ ఫుడ్‌ తినాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే అల్ట్రా పాసెస్‌ చేసిన ఆహారాలు అంటే ఫీజి డ్రింక్స్‌, ప్యాకెజ్‌ చేసిన బ్రెడ్‌, అలాగే తినడానికి సిద్ధంగా ఉండే భోజనం, అల్పాహారం, తృణధాన్యాలు వంటివి తరచూ తీసుకుంటే క్యాన్సర్‌ బారిన పడే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా మహిళలు అండాశయ, రొమ్ము క్యాన్సర్ల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పలు నివేదికల ప్రకారం తీసుకునే ఫుడ్‌లో 10 శాతం అల్ట్రా ప్యాకెజ్డ్‌ ఫుడ్‌ వాడకం పెరిగితే క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం రెండు శాతం పెరుగుతుందని పేర్కొంటున్నారు. అదే అండాశయ క్యాన్సర్‌లో అయితే 19 శాతం పెరుగుతుందని వివరిస్తున్నారు. ఇంకా ప్యాకెజ్డ్‌ ఫుడ్‌ వల్ల వచ్చే ఇతర ఆరోగ్య సమస్యలేంటో చూద్దాం.
– అల్ట్రా ప్రాసెస్డ్‌ ఫుడ్‌లో 10 శాతం వినియోగం పెరిగితే క్యాన్సర్‌ మరణాల్లో 6 శాతం పెరిగితే రొమ్ము క్యాన్సర్‌ 16 శాతం పెరుగుదల ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే అండాశయ క్యాన్సర్‌ కూడా పెరుగుదల 30 శాతం వరకూ ఉంటుందని పేర్కొంటున్నారు. ప్యాకెజ్డ్‌ ఫుడ్‌ కేవలం క్యాన్సర్‌ మాత్రమే కాక ఇతర ఆరోగ్య సమస్యలు కూడా పెంచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. యూకేలో ఇటీవల చేసిన పరిశోధనల్లో పెద్దల్లో, పిల్లల్లో ప్యాకెజ్డ్‌ ఫుడ్‌ వినియోగం కారణంగా భవిష్యత్‌లో వారి ఆరోగ్యంపై ప్రభావం ఉంటుందని తేలింది. అలాగే పెద్దల్లో టైప్‌ -2 డయాబెటిస్‌ పెరిగే అవకాశం ఉందని వెల్లడైంది. పిల్లల్లో అయితే బాల్యం నుంచి యవ్వనం వరకూ అధిక బరువు సమస్యతో బాధపడతారని తేలింది.
–  సాధారణంగా యూకేలో రోజు వారి ఆహారంలో సగానికి పైగా ప్యాకెజ్డ్‌ ఫుడ్‌ పైనే ఆధారపడతారు. ప్యాకెజ్డ్‌ ఫుడ్‌ ఫ్రెష్‌గా ఉండడానికి వివిధ రసాయనాలు కలుపుతారు. దీంతో ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. డబ్ల్యూహెచ్‌ఓ, ఐక్యరాజ్య సమితి, ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ అధికారులు ప్రజలు తీసుకునే ఆహారంలో ప్యాకెజ్డ్‌ ఫుడ్‌ను పరిమితంగా వాడాలని సూచించారని నివేదికలో పేర్కొన్నారు. ప