ఆర్ఎంపీ, పీఎంపీ అసోసియేషన్ అధ్యక్షుడిగా సంపత్

నవతెలంగాణ-గంగాధర
గంగాధర మండల ఆర్ఎంపీ, పీఎంపీ డాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు ఆదివారం జరిగాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా యాదగిరి సంపత్ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. ప్రధాన కార్యదర్శిగా సుంకనపల్లి రమేష్, కోశాధికారిగా కామ శ్రీధర్ ఎన్నిక అయ్యారు. ఎన్నికల అధికారిగా కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్న మాధవుని  నరసింహరాజు వ్యవహరించారు. ఈ ఎన్నకలకు జోనల్ ఉపాధ్యక్షుడు  కొల్ల సంజీవరెడ్డి, జోనల్ ఎథిక్స్ కమిటీ చైర్మన్ కంకణాల ప్రభాకర్ రెడ్డి, కరీంనగర్ డివిజన్ అధ్యక్షుడు దూడం శ్రీనివాస్ హాజరు అయ్యారు.