ఆలయంలో పూజలు నిర్వహించిన ప్రజా ప్రతినిధులు

నవతెలంగాణ-భిక్కనూర్
మండల కేంద్ర శివారులోని దక్షిణ కాశీ శ్రీ సిద్ధిరామేశ్వర ఆలయంలో శనివారం ఎంపీపీ గాల్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ గోవర్ధన్ జన్మదిన సందర్భంగా ఆదివారం ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. పట్టణ సర్పంచ్ తునికి వేణు మాట్లాడుతూ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, రానున్న రోజుల్లో మంత్రి పదవి సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ గుడిసె యాదగిరి, ఆత్మ కమిటీ చైర్మన్ నర్సింహారెడ్డి, రైతుబంధు అధ్యక్షుడు రామచంద్రం, పట్టణ టిఆర్ఎస్ అధ్యక్షుడు అంబల్ల మల్లేశం, ఆలయ ప్రధాన అర్చకులు కొడకండ్ల రామగిరి శర్మ పాల్గొన్నారు.