ఇట్ల చేద్దాం

గుప్పెడు బాదం గింజల్ని మెత్తగా రుబ్బి కాస్త నిమ్మరసం, పావుకప్పు బొప్పాయి గుజ్జు, నాలుగు చెంచాల బ్రౌన్‌షుగర్‌ కలపండి. ఆ మిశ్రమాన్ని ఒంటికి పట్టించి నలుగు పెట్టండి. ఇలా పది నిమిషాలు చేశాక గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేయండి. మృతకణాలు తొలగి, చర్మం మృదువుగా మారుతుంది.