ఇప్పటి వరకూ 33 లక్షల మందికిపైగా కంటిపరీక్షలు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు పథకం కింద నిర్వహిస్తున్న వైద్య శిబిరాల్లో ఇప్పటి వరకూ 33,60,301 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. వారిలో మొత్తం 6,76,732 మందికి కంటి అద్దాలను పంపిణీ చేశారు. ఈ మేరకు సమాచార, పౌర సంబంధాల శాఖ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.