ఉబర్‌లో ఎలక్ట్రిక్‌ టాక్సీలకు ప్రాధాన్యత ఇవ్వండి

– రెడ్కో చైర్మెన్‌ సతీష్‌రెడ్డి విజ్ఞప్తి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ఉబర్‌లో ఎలక్ట్రిక్‌ టాక్సీలకు ప్రాధాన్యత కల్పించాలని రెడ్కో చైర్మెన్‌ సతీష్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఈమేరకు ఉబర్‌ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఆపరేషన్‌ లీడర్‌ రాందాస్‌ ప్రకాశంతో ఆయన సమావేశమయ్యారు. ఉబర్‌లో ఈవీ ఆప్షన్‌ ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలో టాక్సీ రంగంలో ఎలక్ట్రిక్‌ వాహనాల వాడాకాన్ని పెంచేలా రాష్ట్ర పునరుత్పాధక శక్తి అభివృద్ధి సంస్థ కృషి చేస్తున్నదని చెప్పారు. ఉబర్‌ టాక్సీల్లో ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం పెంచే అంశంపై వారితో చర్చించారు. ప్రస్తుతం ఉబర్‌ మొబైల్‌ అప్లికేషన్‌ ఓపెన్‌ చేసినప్పుడు బైక్‌ తోపాటు, వివిధ రకాల వాహనాలు కనిపిస్తాయన్నారు.

Spread the love