ఎంవిఐ డ్రైవింగ్ రూల్స్ పై హైర్ బస్ డ్రైవర్లకు అవగాహన కార్య‌క్ర‌మం

నవతెలంగాణ-కంటేశ్వర్
ఎంవిఐ నియమనిబంధనలు, డ్రైవింగ్ నియమ నిబంధనలపై నిజామాబాద్ ట్రాఫిక్ ఏసిపి నారాయణ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ కాన్ఫరెన్స్ హాల్లో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ మేరకు గురువారం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మర్యాద సురక్షిత డ్రైవింగ్ పై హైర్ బస్ డ్రైవర్ల శిక్షణ కార్యక్రమం ఫిబ్రవరి 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు నిర్వహించాలని సూచనల మేరకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిజామాబాద్ ట్రాఫిక్ ఏసిపి నారాయణ తెలియజేశారు. అందులో భాగంగా మొదటి రోజు  ట్రాఫిక్ ఏసిపి నారాయణ మాట్లాడుతూ.. హైర్ బస్ డ్రైవర్లు తూచా తప్పకుండా ఎం విఐ, డ్రైవింగ్, ట్రాఫిక్ రూల్స్ ను తూచా తప్పకుండా పాటించాలని తెలియజేశారు.
బస్సులో సుమారుగా ప్రయాణికులకు పైగా ఉంటారని వాహనాలను నడిపే ముందు అన్ని చూసుకొని నడపాలని ఈ మధ్యకాలంలో సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్న విషయాలు తమ దృష్టికి వచ్చాయని, అలాగే మితిమీరిన స్పీడ్ తో రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని వీటిని అదుపు చేసేందుకే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. తప్పనిసరిగా నియమ నిబంధనలను ప్రతి ఒక్క డ్రైవర్ పాటించాలని లేనియెడల చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా వివరించారు.
ఈ మధ్యకాలంలో జరిగిన రోడ్డు ప్రమాదాల గురించి వీడియోల రూపంలో చూపిస్తూ డ్రైవర్లకు అవగాహన కల్పించారు. బస్సు నడిపేటప్పుడు ఒకవేళ రోడ్డు ప్రమాదం జరిగితే బస్సులో ఎంతమంది ఉంటారో ఒకసారి బస్సు డ్రైవర్ ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వారందరూ గమనిస్తానానికి చేరుకునే వరకు డ్రైవర్ ది బాధ్యత అని క్లుప్తంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టిసి ఆర్ ఎం ఓ, ఆర్టీసీ డిఎం, నిజామాబాద్ ట్రాఫిక్ సిఐ చందర్ రాథోడ్ తో పాటు ట్రాఫిక్ సిబ్బంది అలాగే హైర్ బస్ డ్రైవర్లు సుమారు 30 మందికి పైగా పాల్గొన్నారు.