ఎన్‌డిటివి నుండి నిష్క్రమించిన జర్నలిస్టు శ్రీనివాసన్‌ జైన్‌

న్యూఢిల్లీ : ఎన్‌డిటివి న్యూస్‌ ఛానెల్‌ అదానీ చేతుల్లోకి వెళ్లిన నుంచి అందులో పనిచేస్తున్న ఉద్యోగులతోపాటు కీలక బాధ్యతలు నిర్వర్తించిన వారు కూడా తమ పదవుల నుండి వైదొలుగుతున్నారు. తాజాగా ఈ న్యూస్‌ ఛానెల్‌లో యాంకర్‌గా పనిచేస్తున్న శ్రీనివాసన్‌ జైన్‌ కూడా ఈ ఛానెల్‌ నుండి వైదొలిగారు. ఈ సందర్భంగా ఆయన ‘ఎన్‌డిటివిలో అద్భుతమైన మూడు దశాబ్దాల పరుగు ఈ రోజుతో ముగుస్తుంది. రాజీనామా నిర్ణయం అంత సులువు కాదు. కానీ.. అది అంతే’… అంటూ శ్రీనివాసన్‌ ట్వీట్‌ చేశారు.
రియాలిటీ చెక్‌, ట్రూత్‌ వర్సెస్‌ హైప్‌ వంటి కార్యక్రమాలకు శ్రీనివాసన్‌ యాంకరింగ్‌ చేశారు. ఈ ప్రోగ్రామ్స్‌ ద్వారా ఆయనకు మంచి గుర్తింపు లభించింది. అలాగే జర్నలిజంలో ఆయన చేసిన కృషికిగాను ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఎన్డీటివి అదానీ పరమైన వెంటనే ఎన్‌డిటివి వ్యవస్థాపకులు ప్రణరురారు, రాధికారారు 2022 డిసెంబర్‌లోనే కంపెనీ బోర్డు నుండి వైదొలిగారు. ఆ తర్వాత జర్నలిస్ట్‌ రవీష్‌కుమార్‌, ఎన్డీటీవీ గ్రూప్‌ ప్రెసిడెంట్‌ సుపర్ణ సింగ్‌ తదితరులు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.