ఎన్నికలకు ముందస్తుగా ప్రణాళికలు రూపొందించుకోవాలి

– శిక్షణ ముగింపు కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డీఎస్‌.లోకేష్‌కుమార్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో
అసెంబ్లీ, పార్లమెంటరీ, స్థానిక సంస్థల ఎన్నికలకు ముందస్తుగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సహాయ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డీఎస్‌.లోకేష్‌కుమార్‌ సూచించారు. రాష్ట్ర స్థాయి ఎన్నికల సహాయ రిటర్నింగ్‌ అధికారులకు (డిప్యూటీ తహశీల్దార్లకు) రెండు రోజుల పాటు జరిగిన శిక్షణ ముగింపు కార్యక్రమంలో శనివారం కమిషనర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియకు అవసరమైన ముందస్తు పనులను గుర్తించి, వేగవంతంగా చర్యలు తీసుకునేందుకు రెండు రోజులపాటు ప్రత్యేకంగా ఎన్నికలపై శిక్షణ, పరీక్షలను నిర్వహించి వారికి అవగాహన కల్పించామని తెలిపారు. ఏఈఆర్‌ఓలు ఎప్పటికప్పుడు బీఎల్‌ఓ వద్ద ఉన్న ఎలక్ట్రోరోల్స్‌ చెకింగ్‌, ఓటరు ఐడీకి ఆధార్‌ అనుసంధానం, ఎన్నికలకు కావాల్సిన మెటీరియల్‌ మేనేజ్మెంట్‌, సిబ్బంది, టీమ్స్‌ ఏర్పాటు, ఈవీఎంల పనితీరు, ర్యాండమైజేషన్‌, వీవీప్యాట్‌లు వంటి పలు అంశాలపై డెంప్‌ (డిస్ట్రిక్ట్‌ ఎలక్షన్‌ మేనేజ్మెంట్‌ ప్లాన్‌)ను కలిగి ఉండాలని సూచించారు. ఎన్నికల నిర్వహణ నోటిఫికేషన్‌ నుంచి పూర్తయ్యే వరకు చేపట్టాల్సిన పనులపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఎన్నికలకు సంబంధించి ఎంసీసీ (మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండెక్ట్‌) ఎంసీిఎంసీ (మీడియా సర్టిఫికేషన్‌, మానిటరింగ్‌ కమిటీ), స్ట్రాంగ్‌ రూమ్స్‌, విజిలెన్స్‌ టీమ్స్‌, స్వీప్‌ పనులు, కంట్రోల్‌ రూమ్‌ వంటి పలు అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎన్నికలకు సంబంధించి పీపుల్స్‌ రిప్రజెంటేటూవ్‌ యాక్ట్‌ 1951ను అనుసరించి ఎన్నికల రూల్స్‌ అయిన 49ఎంఏ, ఫారం -17బి, 17సిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎన్నికల నిర్వహణకు కావాల్సిన అన్ని మిషనరీలపై ముందస్తుగా ప్రణాళికలు రూపొందించుకోవాల న్నారు. అనంతరం శిక్షణ కార్యక్రమంలో రిసోర్స్‌ పర్సన్‌ జయచంద్రారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సిబ్బంది ఎన్నికల నిర్వహణలో భాగంగా ప్రతి అంశంపై సమగ్ర సమాచారం కలిగి ఉండాలన్నారు. ఎన్నికల నిర్వహణలో ఐదు టీమ్‌లు ఎస్‌ఎస్‌టీి, వీఎస్‌టీ, వీవీటీి, ఎఫ్‌ఎస్‌టీి, ఏఎస్‌ఓ, అకౌంటింగ్‌ టీమ్స్‌ల ఏర్పాటులో క్రీయాశీలకమైన వ్యక్తులను ఎంపిక చేయాలన్నారు. ఏఈఆర్‌ఓలు పోలింగ్‌ సిబ్బంది, నోడల్‌ అధికారులు, క్షేత్ర స్థాయి అధికారుల వెంట ప్రత్యేకంగా తమ సిబ్బందిని కేటాయించి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలన్నారు. ఎన్నికలలో వచ్చే సమస్యల పరిష్కారానికి కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలన్నారు. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌లో భాగంగా కేవలం గోడల క్లీనింగ్‌, విగ్రహాలను కప్పి ఉంచడం వంటి పనులే కాకుండా కోడ్‌ ఉల్లంఘించిన ప్రతి కార్యక్రమాలపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎంసీసీలో భాగంగా రాజకీయ నాయకులు వారు చేపట్టబోయే సమావేశాలు, ర్యాలీలకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి, పరిమితికి లోబడి ఎన్నికల ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఎంసీసీి ద్వారా ప్రజలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం కలిగించేలా పారదర్శకంగా పని చేయాలన్నారు. ఎన్నికల్లో రాజకీయ నాయకుల పెట్టే ఖర్చును ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు. కోడ్‌ ఉల్లంఘనలో ఒకరినొకరు దూషించుకోవడం, ఓటర్స్‌ను ప్రభావితం చేయడం, ఎన్నికల్లో పాల్గొనే నాయకుల వాగ్దానాలకు ఫండ్స్‌ ఏ విధంగా ఖర్చు పెట్టనున్నారో వంటి పలు అంశాలపై భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు చర్యలు తీసుకోనున్నారు. ఎన్నికల్లో పోస్టల్‌ ఓటింగ్‌, సర్వీస్‌ ఓటర్లపై ప్రత్యేక చర్యలు తీసుకోలన్నారు. ఎన్నికల నిర్వహణకు కావాల్సిన పూర్తిస్థాయి రోడ్‌ మ్యాప్‌ను రూపొందించుకోవాలని సూచించారు. సీఈఓ కార్యాలయం ఐటీ సెక్షన్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ డి.చిరంజీవులు మాట్లాడుతూ ఎన్నికల్లో టెక్నాలజి పరంగా ఈఎన్‌సీఓఆర్‌ఇ, సి-విజిల్‌, ఎన్‌జిఎస్‌, వెబ్‌ కాస్టింగ్‌ వంటి ఆన్‌లైన్‌ సేవలను ఏర్పాటు చేసేందుకు ఏఈఆర్‌ఓలు చర్యలు తీసుకోవాల న్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఈఓ సత్యావతి, ఏఎస్‌ఓ పాండు రంగారెడ్డి, అసిస్టెంట్‌ సెక్రటరీ సయ్యద్‌ ఆరీఫ్‌ తదితరులు పాల్గొన్నారు.