ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలపై టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ కీలక నిర్ణయం

నవతెలంగాణ – హైదరాబాద్
హైదరాబాద్‌:
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలపై తెలంగాణ స్టేట్‌ లెవెల్‌ పోలీసు రిక్రూట్‌మెంట్‌బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రిలిమ్స్‌లో 7 ప్రశ్నల విషయంలో కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ రాత పరీక్షలో మల్టిపుల్‌ ప్రశ్న విషయంలో అందరికీ మార్కులు కలపాలన్న హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని బోర్డు నిర్ణయించింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఉత్తీర్ణులైన వారికి దేహదారుడ్య పరీక్షలు నిర్వహించనున్నానరు. ఇందుకోసం అప్పుడు ఉన్న హాల్‌ టికెట్ నంబర్లతో లాగన్‌ అయ్యేందుకు అవకాశం కల్పించారు.
ఈనెల 30 నుంచి వెబ్‌సైట్‌లో లాగన్‌ అయి దేహదారుడ్య పరీక్ష కోసం పార్ట్‌-2 అప్లికేషన్‌ సబిమిట్‌ చేయాలని పోలీసు నియామక బోర్డు తెలిపింరాబాద్ది. ప్రస్తుతం ప్రిలిమినటరీలో ఉత్తీర్ణులై ఇప్పటికే దేహదారుఢ్య పరీక్ష పూర్తి చేసిన వారికి అవసరం లేదని స్పష్టం చేశారు. దేహదారుఢ్య పరీక్షలో క్వాలిఫై అవ్వని వారి గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పోలీసు నియామక బోర్డు తెలిపింది. కోర్టు ఆదేశాల ప్రకారం ప్రిలిమనీరలో ఉత్తీర్ణులైన వారు ఫిబ్రవరి 1న ఉదయం 8గంటల నుంచి 5వ తేదీ రాత్రి 10గంటల వరకు పార్ట్‌-2 అప్లికేషన్‌ సమర్పించేందుకు అవకాశం కల్పించారు. ఫిబ్రవరి 8 ఉదయం 8గం నుంచి 12వ తేది రాత్రి 10గం వరకూ దేహదారుఢ్య పరీక్షల హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని బోర్డు తెలిపింది. ఫిబ్రవరి 15 నుంచి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు.