ఓలా లక్ష స్కూటర్లలో సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌

బెంగళూరు: ఒలా ఎలక్ట్రిక్‌ దేశంలోని తన ఒక లక్షకు పైగా వినియోగదారుల స్కూటర్లలోని సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేస్తున్నట్లు పేర్కొంది. 50కి పైగా ఫీచర్స్‌, పనితీరు మెరుగుదల కోసం మోవ్‌ఒఎస్‌ 3ని ఎస్‌1 స్కూటర్లలో రోల్‌ఔట్‌ను ప్రకటించింది. ఇది అతిపెద్ద నవీకరణ అని, ఒక్క ఏడాది గడిచేలోగా ఇది తమ మూడో భారీ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ అని ఓలా ఎలక్ట్రిక్‌ ఫౌండర్‌ భవీష్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు.