ఓసీ పేదల సంక్షేమానికి బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించాలి

నవతెలంగాణ-హిమాయత్‌నగర్‌
గత ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చినట్టుగా రెడ్డి, వైశ్య కులాల్లోని పేదల సంక్షేమం కోసం, ఓసీలోని ఇతర వర్గాల పేదల అభ్యున్నతికి సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్‌ లో ప్రత్యేక నిధులు కేటాయిస్తూ ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలని ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షులు పోలాడి రామారావు డిమాండ్‌ చేశారు. శనివారం బషీర్‌బాగ్‌లోని సమాఖ్య కార్యాలయంలో ఓసీ సంఘాల జేఏసీ ప్రతినిధుల సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ రూ.5 వేల కోట్లతో రెడ్డి కార్పోరేషన్‌, వెయ్యి కోట్లతో వైశ్య కార్పోరేషన్‌ ఏర్పాటు చేస్తూ ఇతర ఓసీ సామాజిక వర్గాల పేదల సంక్షేమానికి మరో వెయ్యి కోట్లను బడ్జెట్‌లో కేటాయించి సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చా లని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో ఓసీ సంఘాల ఐకాస ఆధ్వర్యంలో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరిం చారు. గత హుజురాబాద్‌ ఉప ఎన్నికల సమయంలో మంత్రి హరీష్‌ రావు ఓసీ పేదల సంక్షేమానికి ప్రత్యేక నిధులతో కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీల ను నేటికీ నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. ఈ బడ్జెట్‌లోనైనా మంత్రి హరీష్‌రావు మాట నిలబెట్టుకో వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపు జయపాల్‌ రెడ్డి, రెడ్డి జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు అప్పమ్మగారి రాంరెడ్డి, ఆర్యవైశ్య ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు బుస్సా శ్రీనివాస్‌, వెలమ సంఘాల జేఏసీ చైర్మన్‌ చెన్నమనేని పురుషోత్తమ రావు, కమ్మ సేవా సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగవ రపు రామకృష్ణ ప్రసాద్‌, ఈడబ్ల్యూఎస్‌ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు తాడిశెట్టి పశుపతి, తదితరులు పాల్గొన్నారు.