కలలు సాకారం

– మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌ ప్రజల కలలు సాకారం చేసేలా ఉందని మంత్రి ఏ ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. రూ.1050 కోట్లతో కొత్త కోర్టుల భవన నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. వ్యవసాయంతో పాటు సంక్షేమానికి పెద్ద పీట వేశారని చెప్పారు. తన శాఖలకు బడ్జెట్‌ కేటాయింపులు చేసినందుకు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌ రావుకు కతజ్ఞతలు తెలిపారు. అటవీ శాఖకు రూ. 1,471 కోట్లు, దేవాదాయ శాఖకు రూ. 368 కోట్లు కేటాయించినట్టు తెలిపారు.