కళ్లలో కారం కొట్టి 14 తులాల బంగారు ఆభరణాల దోపిడీ!

హైదరాబాద్: కింద్రాబాద్‌లో గత రాత్రి భారీ దారిదోపిడీ జరిగింది. నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిపై దాడిచేసిన దుండగుడు అతడి కళ్లలో కారం కొట్టి, కత్తితో పొడిచి 14 తులాల బంగారు ఆభరణాలు లాక్కుని పరారయ్యాడు. హిమాయత్ నగర్‌లోని రాధే జువెల్లర్స్‌కు చెందిన పవన్ బంగారు నగలతో సికింద్రాబాద్ బయలుదేరాడు. సికింద్రాబాద్ చేరుకున్నాక సిటీలైట్ హోటల్ సమీపంలో దుండగుడు అతడిపై దాడిచేసి కళ్లలో కారం చల్లి, కత్తితో పొడిచాడు. అనంతరం అతడి వద్దనున్న 14 తులాల బంగారు ఆభరణాలు లాక్కుని పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిందితుడి గాలింపు మొదలుపెట్టారు.