కామ్రేడ్‌ మగ్ధుం స్ఫూర్తిని కొనసాగిద్దాం

– సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు
– ఈటి. నరసింహ
నవతెలంగాణ-అడిక్‌మెట్‌    
తెలంగాణ సాయుధ పోరాటయోధులు కామ్రేడ్‌ మగ్ధుం స్ఫూర్తిని కొనసాగిద్దాం అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈటి నరసింహ పిలుపునిచ్చారు. శనివారం సీపీఐ హైదరాబాద్‌ జిల్లా సమితి ఆధ్వర్యంలో కామ్రేడ్‌ మగ్ధుం జయంతి సందర్భంగా టాంక్‌ బండ్‌ పై ఉన్న కామ్రేడ్‌ మగ్ధుం విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, ప్రముఖ కవి, రచయిత, కార్మిక ఉద్యమ నాయకుడు, పీడిత ప్రజల విముక్తి కోసం రాజీలేని పోరాటం చేసిన గొప్ప నాయ కుడు కామ్రేడ్‌ మగ్ధుం అని కొనియాడారు. ఆయన ఆశయాలను, పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కామ్రేడ్‌ వీఎస్‌ బోస్‌ మాట్లాడుతూ కామ్రేడ్‌ మగ్ధుం పోరాట స్ఫూ ర్తితో ముందుకెళ్లాలన్నారు. ఆయన పోరాటాన్ని త్యాగాన్ని స్ఫూర్తిగా తీసుకుని సమాజంలో విద్వేషాలు రెచ్చగొడుతు న్న మతోన్మాదానికి, అసమానతలకు వ్యతిరేకంగా ఉద్యమించడమే అసలైన నివాళి అన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్‌ జిల్లా సహాయ కార్యదర్శి కామ్రేడ్‌ స్టాలిన్‌, జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్రమోహన్‌ గౌడ్‌, నెర్ల కంటి శ్రీకాంత్‌, కాంపల్లి శ్రీనివాస్‌, కిషన్‌, యువజన నాయకులు ధర్మేంద్ర, ఉమరాన్‌, లతీఫ్‌, సుమంత్‌, కల్యాణ్‌, తదితరులు పాల్గొన్నారు.