కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వ విద్యారంగాన్ని విస్మరించడం సిగ్గు చేటు

నవతెలంగాణ-కంటేశ్వర్
కేంద్ర ప్రభుత్వం కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వ విద్యారంగాన్ని విస్మరించడం సిగ్గుచేటు అని భారత విద్యార్థి ఫెడరేషన్ నగర కమిటీ నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు గురువారం భారత విద్యార్థి ఫెడరేషన్ నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టిన కేంద్ర  బడ్జెట్ 2023-2024 లో విద్య రంగాన్ని విస్మరించిన దానికి  నిరసనగా చెవిలో పువ్వులు పెట్టుకొని స్థానిక ఐటిఐ నందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ నగర కార్యదర్శి మహేష్  మాట్లాడుతూ.. నిన్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఆర్ధికమంత్రి నిర్మాలసితరమన ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ప్రభుత్వ విద్యారంగానికి నిర్దిష్ట విధివిధానాలను రూపొందించకపోవడం చూస్తుంటే  ప్రభుత్వ విద్యపై ఉన్న నిర్లక్ష్యాని తెలియజేస్తుంది.  అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  మొత్తం బడ్జెట్ ప్రసంగంలో ఒక్కసారి కూడా ‘ప్రభుత్వ విద్య’ అనే పదాన్ని ప్రస్తావించకపోవడం విడ్డురమని అన్నాయిరు.
అదే విధంగా గత బడ్జెట్లో విద్యారంగానికి 2022-23 బడ్జెట్ అంచనా మొత్తంలో 2.64% కేటాయింపు చేస్తే ఈ బడ్జెట్ అంచనాలో 2.50%కి  తగ్గింది. అలాగే విద్యకు జిడిపిలో 3% కూడా హామీ ఇవ్వలేదు. ఇది ప్రభుత్వం తీసుకుని వస్తున్న నూతన విద్యా విధానం అమలు చేయడానికి వాగ్దానం చేసిన దానిలో సగం మాత్రమే. జాతీయ విద్యా మిషన్‌కు బడ్జెట్‌లో 600 కోట్లు కేటాయించారు. ఇది కూడా గత బడ్జెట్ కంటే తక్కువ. విద్యా సాధికారత కోసం గత బడ్జెట్ నుండి 826 కోట్లు కేటాయింపు చేశారు. ప్రస్తుత దాని ప్రస్థావన లేదు.ఆల్ ఇండియా సర్వే ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (AISHE 2020-21) ప్రకారం 2020-21లో  విద్యలో SC విద్యార్థుల నిష్పత్తి 14.2%కి పడిపోయింది, అంతకుముందు సంవత్సరం 14.7%. OBC విద్యార్థుల నిష్పత్తి 37% నుండి 35.8%కి మరియు ముస్లిం విద్యార్థులు 5.5% నుండి 4.6%కి పడిపోయింది. వికలాంగుల విభాగంలో విద్యార్థుల సంఖ్య కూడా 92,831 నుండి 79,035కి పడిపోయింది అలాగే మధ్యాహ్న భోజన పథకానికి 1200 కోట్లు తగ్గించి పేదవిద్యార్థుల కడుపు కొట్టి ఏమి అభివృద్ధి సాధిస్తారని అన్నారు. అలాగే విద్యారంగంలో గత అనేక సంవత్సరాలు నుండి అమలు చేస్తున్న నయా-ఉదారవాద విధానాల ఫలితం, విద్య ప్రయివేటీకరణకు దారితీసింది. మరియు అట్టడుగు వర్గాల విద్యార్థులను చదువుకు వెళ్ళకుండా నెట్టివేసింది. ఈ బడ్జెట్ ను చూస్తుంటే విద్యను ప్రైవేటీకరణకు, కార్పొరేట్ శక్తులకు మిరితం చేసేటట్టుగా ఇలాంటి విద్యా వ్యతిరేక బడ్జెట్ కి వ్యతిరేకంగా రానున్న రోజుల్లో పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షులు గణేష్ నగర నాయకులు ఉదయ్, రాజ్ కుమార్,గణేష్, అమాన్ సింగ్ ,సోమేల్ తదితరులు పాల్గొన్నారు.