కొత్తకోటలో ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీకొట్టిన లారీ…


వనపర్తి:
జిల్లాలోని కొత్తకోట సమీపంలో భారీ ప్రమాదం తప్పింది. కొత్తకోట సమీపంలో ఆయిల్‌ ట్యాంకర్‌ను ఓ లారీ ఢీకొట్టింది. దీంతో రెండు లారీలు దగ్ధమయ్యాయి. కొత్తకోట సమీపంలోని టెక్కలి వద్ద హైదరాబాద్‌ నుంచి కర్నూలు వైపు వెళ్తున్న ఆయిల్‌ ట్యాంకర్ టైరు పంచర్‌ అయింది. దీంతో రోడ్డు పక్కన నిలిచిపోయింది. అయితే ఢిల్లీ నుంచి చైన్నై వెళ్తున్న పార్సిల్‌ సర్వీస్‌ కంటైనర్‌.. ట్యాంకర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో కంటైనర్‌లో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. మంటలు ట్యాంకర్‌కు అంటుకోవడంతో రెండు లారీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.