కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం..భారీగా పొగలు

నవతెలంగాణ-హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మొదటి అంతస్తులో అగ్నిప్రమాదం జరిగి గుమ్మటంపై భారీగా పొగలు కమ్ముకున్నాయి. లోయర్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ జరగడంతోనే అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 11 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ నెల 17న కొత్త సచివాలయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్నారు.