గద్దే కట్టించిండ్రు, ట్రాన్స్ఫార్మర్ మార్చడం మర్చిపోయిండ్రు..

– ట్రాన్స్ఫార్మర్ను మార్చాలని ప్రజల వినతులు, పట్టించుకోని ట్రాన్స్కో విద్యుత్ అధికారులు
– ఉన్నతాధికారులు చెప్పిన పట్టించుకోని ఏఈ బస్కే సుధాకర్
నవతెలంగాణ-ధర్మసాగర్
ధర్మసాగర్ మండల కేంద్రంలోని ఎస్సీ కమిటీ హాల్ వద్ద ఉనికిచెర్ల, దేవనూరు, ధర్మసాగర్ గ్రామాల ప్రధాన కూడలిలలో మధ్యగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ అడ్డుగా ఉండడంతో ప్రయాణికులు, వాహనదారులు,ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దానిని తొలగించాలని స్థానిక ప్రజలు,ప్రజాప్రతినిధులు విద్యుత్ అధికారులను దాదాపు రెండు సంవత్సరాల పూర్వమే అర్జీలు పెట్టుకోవడం జరిగింది. ఇప్పటికీ స్థానిక ఏఇ బాస్కే సుధాకర్  ట్రాన్స్ఫార్మర్ మార్చాలంటే తగిన ఖర్చులు అవుతాయని, వాటిని చెల్లిస్తే మేము మార్చడం జరుగుతుందని,పూటకో మాట చెప్పుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు.ఇందుకు సంబంధించిన స్థానికులు,ప్రజాప్రతినిధులు ప్రజలకు ఉపయోగకరమైన పనికి స్థానిక ఏఈకి వినతిపత్రం ఇవ్వగా వినతి పత్రంలో ట్రాన్స్ఫార్మర్ కు అయ్యే ఖర్చులు భరిస్తేనే అది మార్చడం జరుగుతుందని, మరీ రాయించుకోవడం వారి పనుల అలసత్వానికి నిదర్శనంగా చెప్పకనే చెప్పవచ్చు. ఈ విషయంపై ఉన్నతాధికారుల దృష్టికి ప్రజలు ప్రజాప్రతినిధులు తీసుకెళ్లగా ఉన్నత విద్యుత్ అధికారులు అది ప్రజలకు ఇబ్బందిగా ఉండడంవల్ల ఎలాంటి ఖర్చులు లేకుండా ట్రాన్స్ఫార్మర్ మార్చేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. దీంతో   ఏ ఈ ట్రాన్స్ఫార్మర్లు అమర్చేందుకు ఉన్నతాధికారులు చూపెట్టిన స్థలంలో గద్దెలు నిర్మించి నేటికి రెండు సంవత్సరాలు గడుస్తున్న ట్రాన్స్ఫార్మర్లు షిఫ్ట్ చేయకపోవడం వారి పనితనానికి నిలువెత్తు నిదర్శనం. నాటిన పోళ్లను సైతం తీసుకెళ్లడం చాలా విడ్డూరమని స్థానిక ప్రజలు ప్రజాప్రతినిధులు విమర్శిస్తున్నారు.
1. కొట్టే చార్లెస్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ కార్యదర్శి. విద్యుత్ అధికారులకు ప్రధాన కూడలిల్లల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ను షిఫ్ట్ చేయాలని 2001 నుండి వినతులు సమర్పించిన చేయడం లేదు. ట్రాన్స్ఫార్మర్ షిఫ్టింగ్ గద్దలు కట్టించే ముందు ఎలాంటి పైసలు అడగలేదు. గద్దెలను ఏర్పాటు చేసిన తర్వాత డబ్బులు చెల్లిస్తేనే ట్రాన్స్ఫార్మర్ మార్చడం జరుగుతుందని చెప్పడం సరికాదు.
2. కొట్టే విజయభాస్కర్ గ్రామపంచాయతీ11వ వార్డు మెంబర్. నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే ప్రాంతంలో ట్రాన్స్ఫార్మర్ ఉండడం ద్వారా భారీ వాహనాలు, ముఖ్యంగా ఆర్టీసీ బస్సు తిప్పడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకోసం2021 లో లిఖితపూర్వకంగా స్థానిక బస్కే సుధాకర్ గారికి వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. ఇప్పటికీ పనులు జరగకపోవడం వాహనదారులు, ప్రయాణికులు,ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందించి ట్రాన్స్ఫార్మర్ షిఫ్టింగ్  చేయాలి.
3. కొట్టే యాదగిరి బిఆర్ఎస్ పార్టీ నాయకులు. గద్దెలు నిర్మించి ఇప్పటివరకు షిఫ్టింగ్ చేయకపోవడం చాలా బాధాకరం. ఎస్సీ కమ్యూనిటీకి చెందిన బిల్లులను 100 యూనిట్లు లోపు కాల్చినవారికి రాయితీ కల్పిస్తామని చెప్తున్న విద్యుత్ అధికారులు. నేటికీ అమలు చేయకపోవడంలో విఫలమైనారు. బిల్లుల వాసుల చేయడం విషయంలో విద్యుత్ అధికారులు అత్యుత్సాహం చూపిస్తూ,కలెక్షన్ ను కట్ చేసి తీవ్ర మనోవేదనలకు గురి చేస్తున్నారు.
4. మాచర్ల ఏలియా గ్రామపంచాయతీ 12వ వార్డు నెంబర్. దేవునూర్, ఉనికిచెర్ల,ధర్మసాగర్ ప్రధాన కూడలి దారిలో ట్రాన్స్ఫార్మర్ ఉండడం ప్రజలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి. గ్రామపంచాయతీలో తీర్మానంలో ప్రజలకు ఇబ్బంది ఉన్న ట్రాన్స్ఫార్మర్ను మార్చాలని తీర్మానం చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి ఫిర్యాదులు ట్రాన్స్కో డి ఈ, ఎస్సీ ఆధ్వర్యంలో విన్నవించుకోగా వారు స్థానిక ఏఈ బస్సుకే సుధాకర్ కి చెప్పినప్పటికీ జాప్యం జరుగుతుంది. వెంటనే విద్యుత్ అధికారులు స్పందించి  పనులను పూర్తి చేయాలి.

స్థానిక ఏ ఈ బస్కే సుధాకర్ ను ఈ విషయాలపై వివరణ కోరగా వారు ట్రాన్స్ఫార్మర్ మార్చాలని ఒకరు, మార్చకూడదని మరికొందరు అంటున్నారని, అది ఇది చేయాలనే ఉద్దేశంతో ఆపడం జరుగుతుంది. ఇందుకు కొంచెం ప్రాబ్లం వచ్చిందని,స్థానిక నాయకులు కొందరు దీనిపై ఎస్సీకి ఫిర్యాదు చేశారని, దీంతో దేవనూర్ లైన్ కు షిఫ్ట్ చేయాలని, ఫీల్డ్ అబ్జెక్షన్ రావడం వల్ల ఆపడం జరిగింది.ఎస్టిమేషన్ వేసి పంపించడం జరిగిందని. నాకు ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు రాలేదని వారి మాటల్లో తెలియజేశారు.