నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
నాందేడ్ బహిరంగ సభ ఏర్పాట్లలో ఉన్న రాష్ట్ర ప్రజాప్రతినిధులు…సిక్కుల పవిత్ర స్థలమైన గురుద్వార్‌ను సోమవారం దర్శించుకున్నారు. వారికి గురుద్వార్ ప్రబంధక కమిటీ స్వాగతం పలికారు. శాలువాలు కప్పి సత్కరించారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు బాల్కసుమన్, జోగురామన్న, షకీల్, సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మెన్ రవీందర్ సింగ్ ఉన్నారు.