చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లపై తీర్మానం చేయాలి : దాసు సురేష్‌

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ, ఆంధ్రా ముఖ్యమంత్రులు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లపై తీర్మానం చేసి దేశానికి దిక్సూచిగా నిలవాలని బీసీ రాజ్యాధికార వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేష్‌ శనివారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు సాధ్యమయ్యే విధంగా బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా మంత్రి వర్గ తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని పేర్కొన్నారు. బీసీ రాజ్యాధికార సమితి ఢిల్లీ కేంద్ర కమిటీ కన్వీనర్‌ ప్రకాశ్‌ శర్మ నేతృత్వంలో ఢిల్లీలోని యువకులు, విద్యార్థులు తమ సంస్థ పట్ల ఆకర్షితులై సమితిలో చేరారని తెలిపారు.