జమ్ములో అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం నిర్వహించిన సీడీఎస్‌

జమ్ము: చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ నేతృత్వంలో జమ్ములో అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం శుక్రవారం జరిగింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా సీడీఎస్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ జమ్ముకాశ్మీర్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం జమ్ముకు అనిల్‌ చౌహాన్‌ చేరుకున్నారు. శుక్రవారం సమావేశంలో ఉధంపూర్‌ ఆర్మీ కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది, డీజీపీ దిల్బాంగ్‌ సింగ్‌, ఇతర అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అలాగే, జమ్ము జోన్‌ అడిషినల్‌ డీజీపీ ముకేష్‌ సింగ్‌, జమ్ము 16 క్రాప్స్‌ జనరల్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ లెఫ్టినెట్‌ జనరల్‌ సందీప్‌ జైన్‌ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. నగ్రోత కంటోన్మెంట్‌ను సందర్శించిన తరువాత ఢిల్లీకి అనిల్‌ చౌహాన్‌ తిరిగి వెళ్లనున్నారు.