జాతీయ స్కూల్స్‌ చెస్‌..తెలంగాణకు పతకాల పంట

నవతెలంగాణ-హైదరాబాద్‌: జాతీయ స్కూల్స్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారులు పతకాల పంట పండించారు. తమిళనాడులో జరిగిన ఈ పోటీల్లో తెలంగాణకు ఏడు పతకాలు లభించాయి. ఇందులో ఐదు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం ఉన్నాయి. అండర్‌-15 బాలుర విభాగంలో వేముల అద్వైత్‌ విఘ్నేశ్‌ (7.5 పాయింట్లు)… అండర్‌ఉ15 బాలికల విభాగంలో యశ్వి జైన్‌ (7 పాయింట్లు)… అండర్‌-13 బాలుర విభాగంలో చల్లా సహర్ష (8 పాయింట్లు)… అండర్‌-11 బాలికల విభాగంలో మోదిపల్లి దీక్షిత (7.5 పాయింట్లు)… అండర్‌-9 బాలికల విభాగంలో పుంగవనం సంహిత (8 పాయింట్లు) పసిడి పతకాలు గెలిచారు. అండర్‌-7 బాలుర విభాగంలో ఆదుళ్ల దివిత్‌ రెడ్డి (7.5 పాయింట్లు) కాంస్యం, అండర్‌-7 బాలికల విభాగంలో బోగా వంశిక (7 పాయింట్లు) రజతం సాధించారు. పతకాలు సాధించిన వారికి నెలనెలా భారత గ్రాండ్‌మాస్టర్‌ ఎం.శ్యామ్‌సుందర్‌తో ఉచిత శిక్షణ శిబిరం ఏర్పాటు చేస్తామని తెలంగాణ రాష్ట్ర చెస్‌ సంఘం అధ్యక్షుడు కేఎస్‌ ప్రసాద్‌ ప్రకటించారు.