జార్ఖండ్‌లో ఘోర అగ్నిప్రమాదం

– ఆరుగురు మృతి
జార్ఖండ్‌ : జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌ నగరంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఇక్కడ ఒక ఆస్పత్రిలో మంటలు చేలరేగడంతో వైద్య దంపతులతో సహా ఆరుగురు మతి చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపుచేశారు. మతులను డాక్టర్‌ హజారా, ఆయన సతీమణి డాక్టర్‌ ప్రేమ హజారాగా గుర్తించారు. మతుల్లో యజమాని మేనల్లుడు సోహన్‌ ఖమారి, ఇంటి పనిమనిషి తారా దేవి, మరో ఇద్దరు ఉన్నారని పోలీసులు తెలిపారు. హాస్పిటల్‌ కాంప్లెక్స్‌లోనే వారి ఇళ్లు కూడా ఉందని వెల్లడించారు. ఆస్పత్రిలోని రోగులకు ఎలాంటి ప్రమాదం జరుగలేదన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ధన్‌బాద్‌ డీఎస్పీ అర్వింద్‌ కుమార్‌ బిన్హా తెలిపారు.