తప్పుడు ఆటో నంబర్ ప్లేట్ పెట్టెన వ్యక్తి పై చీటింగ్ కేసు నమోదు

నవతెలంగాణ-కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఒకటో పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటోకు తప్పుడు ఆటో నెంబర్ ప్లేటు పెట్టిన వ్యక్తిపై ఒకటవ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసును నమోదు చేసినట్లు ఒకటవ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ విజయ్ బాబు శనివారం ప్రకటనలో తెలిపారు. తేదీ 10-02-2023 రోజున ట్రాఫిక్ పోలీస్ తనిఖీలో భాగంగా, ఒక ఆటోను తనిఖీ చేయగా మోసపూరితంగా ఆటో నెంబర్ టీఎస్ 16యు బి 3341 బదులుగా టీఎస్ 16 యు బి 3241 నెంబర్ ప్లేట్ పెట్టుకొని ఆటోను నడుపుతుండడంతో ట్రాఫిక్ పోలీస్ ల పిర్యాదు పై చీటింగ్ కేసును నమోదు చేసినట్లు ఎస్ హెచ్ ఓ తెలిపారు. ఇక నుండి తప్పుడు నెంబర్ ప్లేట్ పెట్టిన, నెంబర్ టాంపరింగ్ చేసిన అట్టి వ్యక్తుల పై చట్టరీత్య చర్యలు ఉంటాయన్నారు. ఎం వి ఐ రూల్స్ అనుసారంగా నెంబర్ ప్లేట్ పెట్టుకోవాలి అని వాహనదారులకు ఒకటవ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ విజయ్ బాబు తెలియజేశారు.