దేశవ్యాప్తంగా హగ్‌ హెర్‌ మోర్‌ ప్రచార కార్యక్రమం

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
దేశవ్యాప్తంగా హగ్‌హెర్‌ మోర్‌ ప్రచార కార్యక్రమాన్ని చేపడుతు న్నామని ఐటీసీ ఫుడ్స్‌ డివిజన్‌, బిస్కట్స్‌, కేక్స్‌ క్లస్టర్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ అలీ హ్యారీస్‌ షెరీ తెలిపారు. శుక్రవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఐటీసీ సర్వేలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది తమ తల్లులను ఆప్యాయంగా కౌగిలించుకోవడమనేది బాల్యం నాటితో పోలిస్తే 50 శాతం తగ్గిందని తెలిపారు. తమ ‘సంతోషాలకు’ ప్రధాన మూల కారణం తమ తల్లులేనని సర్వేలో పాల్గొన్నవారిలో 60 శాతం మంది చెప్పా రని పేర్కొన్నారు. ఉరుకుల పరుగుల ప్రపంచంలో ఒత్తిళ్లు పెరిగిపోతు న్నాయనీ, కాస్త విశ్రాంతి పొందడానికి ఆన్‌లైన్‌లో కంటెంట్‌ చూడటమో, గేమ్స్‌ ఆడటమో, సోషల్‌ మీడియాను చూసుకోవడమో చేస్తున్నారని తెలిపారు. తల్లిదండ్రులతో కలిసి గడిపే సమయం, భౌతికంగా వారికి దగ్గరగా ఉండటం అనేది తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఐటీసీ సన్‌ ఫీస్ట్‌ మామ్స్‌ మేజిక్‌ ఇటీవల నిర్వహించిన సామాజిక ప్రయోగంలో ‘తల్లిని ఆప్యాయంగా కౌగిలించుకోవడం’ అనే అంశంపై మంచి స్పందన వచ్చిందని తెలిపారు.