నకిలీ పట్టాలతో వచ్చే వారిని తరిమికొట్టాలి

– గొల్లపల్లి నాగయ్య  వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు
నవతెలంగాణ-గోవిందరావుపేట
విలువైన భూముల కోసం నకిలీ పట్టాలు పనికిరాని దత్తతలతో వచ్చేవారిని తరిమికొట్టాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు గొల్లపల్లి నాగయ్య అన్నారు. ఆదివారంమండలంలోని పసర గ్రామంలో గుడిసేవా సుల సమావేశానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు  గొల్లపల్లి నాగయ్య  హాజరై మాట్లాడారు. 109 సర్వే నెంబర్ లో పేదలు వేసుకున్న గుడిసెలకు ప్రభుత్వం వెంటనే పట్టాలు ఇచ్చి పక్కాఇల్లు నిర్మించాలని కోరుతు ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలు 40 లక్షల మంది ఉన్నారని ప్రభుత్వం ఇప్పటివరకు మూడు లక్షల మందికి ఇండ్లు ఇచ్చిందని ఇలా ఇస్తే మిగతా వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి ప్రభుత్వానికి ఎన్ని రోజులు పడుతుందని ఈ జన్మ సరిపోదని ఎద్దేవా చేయటం జరిగింది. ప్రభుత్వాల మీద నమ్మకం లేకనే పేద ప్రజలు ప్రభుత్వ భూములు ఆక్రమించుకుని గుడిసెలు నిర్మించుకుంటున్నారన్నారు.
ప్రభుత్వ భూములలో భూస్వాములు దొంగ పట్టాలతో వస్తే ప్రజలు తరిమికొట్టాలని మీకు సిపిఎం పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. ఈనెల తొమ్మిదో తారీఖున హైదరాబాదులోని ఇంద్ర పార్క్ లో జరిగే గుడిషవాసుల మహాధర్నాను మీరందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ప్రభుత్వం ఇళ్ల స్థలాలతో పాటు ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి సాంబశివ తీగల ఆగి రెడ్డి పొదిల చిట్టిబాబు, అంబాల పోషాలు, సప్పిడి ఆదిరెడ్డి, అంబాల మురళి, గిట్టబోయిన రమేష్, ఉపేంద్ర చారి పల్లపురాజు, కందుల రాజేశ్వరి, పాయం శారద, సంకినేని, రాజేశ్వరి, సరిత, జిమ్మజ్యోతి, అంజద్, పాషా మంచాల, కవిత తదితరులు పాల్గొన్నారు.