నిరుపేదలకు అండగా నవతెలంగాణ

– క్యాలెండర్‌ ఆవిష్కరించిన రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి
నవతెలంగాణ-చిలిపిచేడ్‌
నవతెలంగాణ దినపత్రిక.. నిత్యం సమస్యలను వెలికి తీస్తూ నిరుపేదలకు అండగా నిలుస్తోందని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. మెదక్‌ జిల్లా చిలిపిచేడ్‌ మండల కేంద్రంలో ఎమ్మెల్యే మదన్‌రెడ్డితో కలిసి బుధవారం ఆమె నవతెలంగాణ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. నవతెలంగాణ పత్రిక ప్రజల పక్షాన పోరాడుతోందన్నారు. సమస్యలపై వార్తలు రాస్తూ ప్రజలకు, అధికారులకు, ప్రభుత్వానికి వారథిగా నిలుస్తోందన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు అశోక్‌ రెడ్డి, నాయకులు మధుసూదన్‌ రెడ్డి, ఎంసీ విఠల్‌, ముకుందారెడ్డి, లక్ష్మణ్‌, సర్పంచుల ఫోరమ్‌ అధ్యక్షులు లక్ష్మి దుర్గారెడ్డి, నవతెలంగాణ రిపోర్టర్‌ శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.