నేడు అనాథల అరిగోస దీక్ష : మంద కృష్ణ మాదిగ

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
అనాధల అరిగోస దీక్షను చేపట్టనున్నట్టు మంద కృష్ణ మాదిగ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఇందిరా పార్కు వద్ద చేపట్టనున్న దీక్షకు వివిధ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నేతలు హాజరవుతారని పేర్కొన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం అనాధలకు ఎన్నో హామీలు ఇచ్చిందనీ, ఆ హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నదని విమర్శించారు. అనాధల సంక్షేమం కోసం నియమించబడ్డ మంత్రి వర్గ ఉప సంఘం ఎన్నో తీర్మానాలు చేసిందనీ,వాటిని అమలు చేయటం లేదని తెలిపారు. మంత్రి వర్గ ఉపసంఘం సిఫారసులు, ప్రభుత్వ హామీలను అమలు చేయాలని కోరతూ దీక్ష చేస్తున్నట్టు తెలిపారు.