నేడు ఐప్సో తృతీయ మహాసభ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం (ఐప్సో) రాష్ట్ర మహాసభను శనివారం హైదరాబాద్‌లోని వనస్థలి పురంలో నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు ఆరంభమయ్యే ఈ సభలో మాజీ ఎమ్మెల్సీ కె.యాదవరెడ్డి పతాకావిష్కరణ చేస్తారు. ఐప్సో డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ హరిచంద్‌సింగ్‌ భట్‌ మహాసభను ప్రారంభిస్తారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్‌, ఐప్సో జాతీయ ప్రధాన కార్యదర్శులు అరుణ్‌ కుమార్‌, డాక్టర్‌ డి.సుధాకర్‌, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి తదితరులు పాల్గొంటారు.