పక్కా ఇండ్లు మంజూరు చేయాలంటూ.. కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

నవతెలంగాణ-పాల్వంచ
నిరుపేదలమైన తమకు పక్క ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం భద్రాద్రి జిల్లా పాల్వంచలోని జిల్లా కలెక్టరేట్‌ ఎదుట మహిళలు ఆందోళన చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అశ్వారావుపేట మండలం గుర్రాల చెరువు వద్ద ఉండే తామూ రోజువారి కూలీ పనులు చేసుకుంటూ బతుకుతున్నామని తెలిపారు, తమకు ఎలాంటి సొంత స్థలం ఇల్లు లేక అద్దె గదుల్లో ఉంటూ దుర్భరమైన జీవితాలు గడుపుతూ ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. తామంతా ఎస్సీ మాదిగ, బీసీ గొల్ల కులాలకు చెందిన వారమని, ఇప్పటికైనా తమపై దయవుంచి పక్కా ఇండ్లు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో మహిళలు కే.పుష్ప, కె.సునీత, కే.లక్ష్మి, ఆర్‌.మరియమ్మ, చిలకమ్మ, మహాలక్ష్మి, సొరకాయ లక్ష్మి, కె.రాజా రాణి తదితరులు పాల్గొన్నారు.