పేదల కష్టాలు తీర్చే పార్టీ బీజేపీ పార్టీ

– బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ
నవతెలంగాణ-కంటేశ్వర్
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రజా గోస బీజేపీ భరోసా కార్యక్రమం ప్రజల వద్దకు తీసుకొస్తున్నాము అందుకే కార్నర్ మీటింగులు ఏర్పాటు చేయడం జరుగుతుంది అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ఈ మేరకు సోమవారం వినాయక నగర్ మండలం 07  డివిజన్ శక్తి కేంద్రంలో  కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కెసిఆర్ అరాచకాలను అరికడుగుతామన్నారు కేంద్ర ప్రభుత్వ పథకాలను నరేంద్ర మోడీ  పాలనను ప్రజలకు తెలియజేస్తామన్నారు. కెసిఆర్ ప్రభుత్వం దళితులను మోసం చేసిందన్నారు దళిత ముఖ్యమంత్రి అని చెప్పి మోసం చేశారన్నారు పది లక్షల దళిత బంధు పేరుమీద మళ్లీ మోసం చేశారు. మూడెకరాల భూమి ఏమైందని ప్రశ్నించారు విద్యా వ్యవస్థకు వస్తే కేజీ టు పీజీ ఉచిత విద్య దేవుడెరుగు ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థను పట్టించుకోవడం లేదు అని అన్నారు బస్తీ దౌకణలు ఎక్కడ అని ప్రశ్నించారు.
అర్బన్ లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్నారు అండర్ గ్రౌండ్  పనులు ఇప్పటివరకు పూర్తి కాలేదు అన్నారు. ఎల్ఈడి లైట్లు పెట్టి సుందరీకరణ పేరు మీద వందల కోట్లు తీసుకొచ్చారన్నారు ఏమయ్యఅని ప్రశ్నించారు రాష్ట్రంలో కెసిఆర్ అర్బన్ లో బీగాల కమిషన్ల మీద పడ్డారని ఎద్దేవా చేశారు. కెసిఆర్ అవినీతి తారాస్థాయికి చేరిందన్నారు బుడ్డమ్మ చెరువు పనులు 05 సంవత్సరాల నుంచి ఇప్పటికి పూర్తి కాలేదు అన్నారు.  కెసిఆర్ అవినీతిలో అహంకారంలో నెంబర్ వన్. ధనిక రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా తీర్చిదిద్దారన్నార ఈరోజు మహిళా సోదరీమణుల విషయానికొస్తే డ్రాకువ మహిళలు కు మోసం చేసిన ఏకైక వ్యక్తి ఎవరంటే అది కెసిఆర్ అని అన్నారు వారికి పవాల వడ్డీ లేని రుణాలను చెప్పి ఈరోజు వారి దగ్గర నుంచి రూపాయి నర వడ్డీ వసూలు చేస్తున్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూం లో అర్బన్ లో ఎంత మందికి ఇచ్చారని ప్రశ్నించారు అర్బన్ ప్రజలంటే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎందుకు చులకన అని అన్నారు.
ఈరోజు కేంద్ర ప్రభుత్వాలు నరేంద్ర మోడీ  ప్రభుత్వం చేపడుతున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలను అక్కున చేర్చుకుంటా ఉన్నాయి ఈరోజు జన్ధన్ యోజన కావచ్చు ఉజ్వల యోజన కావచ్చు, బేటి బచావో బేటి పడావో , ఆవాస్ యోజన కింద కోట్లాధి నిరుపేదలకు ఇల్లు కట్టేస్తున్నామన్నారు పేద ప్రజల ఆరోగ్య దృశ్య ఆయుష్మాన్ భారత్ పథకం ని తెలంగాణలో ఈ ముఖ్యమంత్రి ఎందుకు రానివ్వట్లేదు ,సమాధానం చెప్పాలన్నారు ఈరోజు ఆయుష్మాన్ భారత్ పథకం వస్తే రాష్ట్రంలో పేదలకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. కెసిఆర్ రాసుకో ఇందూరు నుంచే  బి ఆర్ ఎస్ పార్టీని బొంద పెట్టడానికి ప్రజలంతా సిద్ధమవుతున్నారు అని అన్నారు పేదల ఆశయాల కనుగుణంగా పనిచేస్తుంది మోడీ ప్రభుత్వం ప్రజలారా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి పేదల కోసమే వారి ప్రజల  కనుక్కునంగానే నరేంద్ర మోడీ పాలన అందిస్తున్నారు.
భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఇందూరు నుంచి గెలిస్తే మనకి ఇప్పటివరకూ 10,000 డబుల్ బెడ్ రూములు వచ్చేవి ఈరోజు ఎమ్మెల్యే వారిని ప్రశ్నిస్తే లేడు డబుల్ బెడ్ రూమ్ లో  తీసుకురావడం లేదు ఈరోజు నిరుద్యోగులను నిండా ముంచుతున్నారు. యువకులను మద్యానికి బానిసలు చేస్తున్నారన్నారు. ఈరోజు నిరుద్యోగ భృతి 3016 అందిస్తానని హామీ ఇచ్చి ఇప్పటి వరకు వరి అని నెరవేర్చలేదు ఒకవేళ బీజేపీ ప్రభుత్వం తెలంగాణ లో ఏర్పడగానే నిరుద్యోగ సమస్యలను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో  స్థానిక కార్పొరేటర్ సుక్క మధు బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు నాగోల్ల లక్ష్మీనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతనకర్ లక్ష్మీనారాయణ, అసెంబ్లీ కన్వీనర్ పంచారెడ్డి లింగం, శక్తి కేంద్రా ఇన్చార్జులు బూత్ స్థాయి కార్యకర్తలు బస్తీ వాసులు పాల్గొన్నారు

Spread the love