ప్రజల చైతన్యం కోసం ‘మన ప్రాంతం-మన అభివద్ధి’

నవతెలంగాణ-కంటోన్మెంట్‌
కంటోన్మెంట్‌ ప్రాంతాన్ని జీహెచ్‌ఎంసిలో విలీనం విషయంపై ప్రజలను చైతన్యవంతులు చేసేందుకు కంటోన్మెంట్‌ మంచి వికాస్‌ మంగళవారం బోయిన్‌పల్లిలో ‘మన ఆత్మగౌరవం-మన ప్రాంత అభివద్ధి’ పేరుతో మర్జర్‌ వాక్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంతో విలీనంపై ప్రజలను చైతన్యపరుస్తూ, విలీనం వల్ల కలిగే లాభాలను తెలియజేస్తూ మంచి వికాస్‌ ప్రతినిధులు కడక్‌పుర, కమిస్సరీ బజార్‌, పెన్షన్‌ లైన్‌ ప్రాంతాల్లో స్థానిక బస్తీ పెద్దలను కలుస్తూ విలీనంపై చైతన్యం తెప్పిస్తున్నారు. బస్తీ పెద్దలు వికాస్‌ మంచి విలీనంపై చేస్తున్న పోరాటానికి ముక్తకంఠంతో మద్దతు తెలుపుతూ, కంటోన్మెంట్‌ ప్రాంతం జీహెచ్‌ఎంసి లో విలీనంతోనే మన ఆత్మగౌరవం మన అభివద్ధి సాధ్యం అని వారు మేము సైతం సై అన్నారు. ఈ కార్యక్రమంలో బస్తీ పెద్దలు సిరాజ్‌ ఖాన్‌, అమీద్‌ బై, లక్ష్మణ్‌, శ్రీనివాస్‌, మహ్మద్‌ షఫీ, సయ్యద్‌ పాటు వికాస్‌ మంచ్‌ అధ్యక్షులు గడ్డం అబెల్‌, ప్రధాన కార్యదర్శి సంకి రవీందర్‌, ఎల కంటి ప్రభు గుప్తా, అరుణ్‌ యాదవ్‌, బల్వంత్‌ రెడ్డి, గుడ్డు బారు, మహమ్మద్‌ ఫసి, అంబాల శ్రీనివాస్‌, నర్సింగరావు, చోటు పాల్గొన్నారు.

Spread the love