ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన ప్రభుత్వం

చింతలపూడి భాస్కర్ రెడ్డి బిజెపి ములుగు జిల్లా అధ్యక్షులు.
నవతెలంగాణ-గోవిందరావుపేట
అధికారమే పరమావధిగా భావిస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం గాలికి వదిలేసిందని బిజెపి ములుగు జిల్లా అధ్యక్షులు చింతలపూడి భాస్కర్ రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని చల్వాయి గ్రామంలో బిజెపి మండల అధ్యక్షులు మద్దినేని తేజ రాజు అధ్యక్షతన బూత్ అధ్యక్షులు సభ్యులతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భాస్కర్ రెడ్డి హాజరై మాట్లాడారు. టిఆర్ఎస్ ప్రభుత్వము వైఫల్యాలను గురించి చర్చించారు లక్ష రూపాయల రుణమాఫీ ఇప్పటివరకు చేయలేదని రైతులకు 24 గంటల ఉచిత కరంట్ ఇస్తామని చెప్పి 8 గంటల నాణ్యమైన కరెంటు కూడా ఇవ్వలేకపోతున్నారు అని అన్నారు. రైతుబంధు పేరిట రైతులకు వర్తించు అన్ని పథకాలను రద్దుచేసి వందల ఎకరాలు ఉన్నోళ్లకు మాత్రమే మేలు జరుగుతుందన్నారు. బియాస్ పేరిట రాష్ట్రం నుండి సంపాదించిన సంపాదన మొత్తం ఇతర రాష్ట్రాలకు పోయి అక్కడ ఖర్చుపెట్టి దేశాన్ని వెళదామని కేసీఆర్ పన్నాగం పండుతున్నారు కావున సోదరులారా మరలా మరలా మోసపోవద్దని నిజమైన అభివృద్ధిని కాంక్షించేవారు. బిజెపికి గెలిపించాలని, బిజెపి వస్తే ఉచిత విద్య ఉచిత, వైద్యం, ఇస్తామని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఎనిమిది సంవత్సరాల నుండి చేసింది ఏంలేదు అన్నారు. ఈ కాంగ్రెస్ నాయకులు గెలిచినా బిఆర్ ఎస్ కు అమ్ముడుపోయేవారే  నని అన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న వారు అసెంబ్లీ కన్వీనర్ బలరాం పాలసీ అండ్ రీసెర్చ్ రాజు నాయక్, నీరటి కుమార్, జినుకల కృష్ణకర్ రావు, వాసుదేవ రెడ్డి,కొత్త సురేందర్ రుద్రారపు సురేష్, మెరుగు సత్యనారాయణ ,కొత్త సుధాకర్ రెడ్డి, ఎద్దునూరి రమేష్ ,కొమరపాలెం ధర్మారావు, గట్ల రాజు, కుమ్మరి కుంట్ల నరసయ్య, వేములపల్లి కుమార్ స్వామి, గంగుల సాంబయ్య,  బిస్కుల శేఖర్, ఓల్లాల రాజేందర్, కన్నెబోయిన, కొమురయ్య, కూతురి రమేష్, ఓల్లాల హరి కృష్ణ,,కానుగుల కృష్ణ, బొజ్జ రఘు, బోయిని నాగరాజు, కుమ్మరి కుంట్ల భాను ఋషి, ఇండ్ల మొగిలి, గంగుల చందు, కన్నెబోయిన సురేష్, తదితరులు పాల్గొన్నారు.

Spread the love