ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు : అజ్జు యాదవ్

నవతెలంగాణ – చిన్నకోడూరు
దేశ భవిష్యత్తు కోసం కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు తరలి వచ్చిన అన్ని వర్గాల ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు, నాయకులకు యూత్ కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ యాత్రిక్ అజ్జు యాదవ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తండోపతండాలుగా జనం తరలి వచ్చి రాహుల్ గాంధీ కి స్వాగతం పలికారనీ, ఇక్కడి ప్రజల ప్రేమానురాగాలకు రాహుల్ మంత్రముగ్ధులయ్యారని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని తెరాస ప్రభుత్వాలు ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయని, ఆ రెండు ప్రభుత్వాలకు కాలం చెల్లిందన్నారు. రాహుల్ జోడో యాత్రతో బీజేపీ, తెరాస పార్టీల్లో వణుకు మొదలైందన్నారు. జోడో యాత్రను అద్భుతంగా సక్సెస్ చేసిన అందరికీ మరోసారి అజ్జు యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. యాత్ర సక్సెస్ కావడానికి సహకరించిన రాష్ట్ర ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు, పోలీస్ మరియు వైద్య అధికారులకు, మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.