ప్రముఖ గుట్కా వ్యాపారికి ఈడీ నోటీసులు

నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : నగరంలోని ప్రముఖ గుట్కా వ్యాపారికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. మానిక్‌చంద్‌ అనే ఈ గుట్కా కంపెనీ యాజమాన్యానికి గురువారం తమ ఎదుట హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చారు. గుట్కా వ్యాపారంలో భారీ మొత్తంలో మనీ లాండరింగ్‌ చోటు చేసుకున్నదనే ఆరోపణలపై ఈడీ విచారణకు పూనుకున్నదని తెలిసింది. దీనికి సంబంధించి కొన్ని ఆధారాలు సేకరించిన ఈడీ అధికారులు గుట్కా కంపెనీ యాజమాన్యాన్ని తన ఎదుట విచారణకు హాజరు కావాలంటూ ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది.