ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించాలి

– టీపీసీసీ  అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం డిమాండ్
నవతెలంగాణ-గంగాధర
నారాయణపూర్ ప్రాజెక్టు కట్ట మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేసి  పంటలకు సాగునీరు అందించాలని టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం డిమాండ్ చేశారు. గత వర్షాలకు గండిపడిన గంగాధర మండలం నారాయణపూర్ ప్రాజెక్టు కట్ట మరమ్మత్తు పనులను మేడిపల్లి సత్యం ఆదివారం పరిశీలించి, భూ నిర్వాసితులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం మాట్లాడుతూ నారాయణపూర్, మంగపేట, చర్లపల్లిని ముంపు గ్రామాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. నారాయణపూర్ రిజర్వాయర్‌ పనులను త్వరితగతిన పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు అందించాలన్నారు. తెగిపోయిన కట్ట మరమ్మత్తు పనులు వెంటనే పూర్తి చేయాలని, అధికారుల నిర్లక్ష్యంతో వరి పంటలు ఎండిపోయే దశకు చేరుకున్నాయని అన్నారు. ఈ నెల 10 తేదీ వరకు రైతులకు సాగునీరు ఇవ్వకపోతే రైతులతో మరోసారి ఆందోళన చేపడతామని హెచ్చరించారు.  ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పురుమల్ల మనోహర్, వన్నెల రమణారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దుబ్బాసి బుచ్చయ్య, కిసాన్ సెల్ అధ్యక్షులు బూర్గు గంగయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు రామిడి రాజిరెడ్డి, చిప్ప చక్రపాణి, లచ్చయ్య, జారతి మోహన్, రాచమల్ల భాస్కర్ , తోట కరుణాకర్, వీరేశం, కోల ప్రభాకర్,  యువజన కాంగ్రెస్ నాయకులు మంత్రి మహేందర్, సతీష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.