బండి సంజయ్‌ క్షమాపణ చెప్పాలి..

– బోయినపల్లి వినోద్‌కుమార్‌ డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సచివాలయ నూతన భవనంపై ఏర్పాటు చేసిన జాతీయ చిహ్నాల డోమ్‌లను కూల్చి వేస్తామంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యాఖ్యానించటం అత్యంత శోచనీయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ విమర్శించారు. ఆయన వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలనీ, ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. బండి సంజయ్‌ భారత రాజ్యాంగం పట్ల కనీస అవగాహన లేకుండా మాట్లాడితే ఎలా అంటూ ప్రశ్నించారు. బీజేపీ నేర్పే నీతి, విధానం ఇదేనా..? అని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు, గుజరాత్‌ సచివాలయం సహా అనేక రాష్ట్రాల్లోని సెక్రటేరియట్‌ భవనాలపై ఇదే తరహా డోమ్‌లున్న వాస్తవం బండి సంజయ్‌కు తెలియకపోవటం విచారకరమని ఆయన ఎద్దేవా చేశారు.