బడ్జెట్‌లో భారీ అంకెలు

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
ఎన్నికల సంవత్సరం ప్రజల కోసం ఏదో చేస్తున్నాం అన్నట్టు బడ్జెట్‌ ఉంది తప్ప అందులో ఏమీ లేదు. ప్రజలను మభ్యపెడుతున్నారు. అమలు చేయాలని చిత్తశుద్ది ఉంటే గత కేటాయింపుల విషయంలో ఎంత ఖర్చు చేశారో చెప్పాలి. ఇండ్ల స్థలాలు, రుణమాఫీ, డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లపై బడ్జెట్‌లో ప్రస్తావన లేదు. 24 గంటల ఉచిత విద్యుత్‌ అని గొప్పలు చెపుతున్నారు కానీ ఎక్కడా 5గంటలు కూడా రావడం లేదు. రైతులు ఇబ్బందులు పడుతున్నారు. 50 శాతం పైనున్న బీసీలకు కేటాయించింది కేవలం రూ.6వేల కోట్లు. 8 ఏండ్లలో ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులు పక్కదారి పట్టాయి. ఓల్డ్‌ పెన్షన్‌ స్కీమ్‌ గురించి బడ్జెట్‌లో ప్రస్తావన లేదు. ఉద్యోగులు నష్టపోతున్నారు.
నిరుద్యోగ భృతి మాటే ఎత్తలేదు
లిక్కర్‌ తప్ప దేనిలోనూ రాష్ట్ర అభివృద్ధి కన పడటం లేదు. కొద్ది మంది అధికారులు రాసిస్తే.. భారీ బడ్జెట్‌ అని ఎన్నికలకు ముందు చెప్పే ప్రయత్నం ఇది. నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం లేదు. రెసిడెన్షియల్‌ స్కూళ్లకు సొంత భవనాలు లేవు. వాటికి నిధులు కేటా యిస్తారని అనుకున్నాం. మంత్రి హరీశ్‌రావు మాటలతో మేడి పండు బడ్జెట్‌ ప్రవేశపెట్టారు.