బిగ్‌ సీ వార్షికోత్సవ రెండవ లక్కీ డ్రా విజేతల ఎంపిక

హైదరాబాద్‌ : ప్రముఖ మొబైల్‌ రిటైల్‌ చెయిన్‌ బిగ్‌ సీ తన 20వ వార్షికోత్సవం సందర్బంగా ప్రకటించిన ఆఫర్లలో భాగంగా రెండవ లక్కీ డ్రాను విజయవంతంగా నిర్వహించింది. ఈ లక్కీ డ్రాలోని విజేతలను ఆ సంస్థ వ్యవస్థాపకులు, సీఎండీ బాలు చౌదరీ బుధవారం ప్రకటించారు. రెండో లక్కీ డ్రాలో ఏడు చొప్పున మారుతి సుజుకి ఆల్టో కార్లు, బజాజ్‌ ప్లాటినా బైకులు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, టీవీల విజేతలను ప్రకటించింది. 35 మంది విజేతలను ఎంపిక చేసింది. లక్కీ డ్రా విజేతలతో పాటుగా బిగ్‌ సీలో చేసే ప్రతీ కొనుగోలుపై డిస్కౌంట్‌తో పాటుగా ఖచ్చితమైన బహుమతిని అందిస్తున్నామని బాలు చౌదరి తెలిపారు. రెండో లక్కీడ్రాలో ఎస్‌కె రేష్మ, మాదరి రాహుల్‌ రారు, గడ్డం అనురాధా, ఎ ఆకాశ్‌, ఎం బాస్కర్‌, హెచ్‌ నౌషద్‌, జె శేఖర్‌ అల్టో కారులను గెలుపొందిన వారిలో ఉన్నారు. తమ వద్ద స్మార్ట్‌ఫోన్‌, స్మార్ట్‌ టీవీ, ల్యాప్‌ టాప్‌ కొనుగోలు చేసిన ఖాతాదారులకు లక్కీ డ్రా నిర్వహించి విజేతలకు 20 కార్లు, 20 బైకులు, 20 ఎసిలు, 20 రిఫ్రిజిరేటర్లు, 20 టివిలు బహుమతిగా ఇస్తామని బాలు చౌదరీ తెలిపారు. వీటితో పాటు ప్రతీ మొబైల్‌ కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి, 10 శాతం వరకు క్యాష్‌ బ్యాక్‌, సులభ వాయిదాల పద్దతిలో చెల్లింపులు, డౌన్‌ పేమెంట్‌ లేకుండా మొబైల్‌ కొనుగోలు సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ఆఫర్లు డిసెంబర్‌ 3 నుంచి 2023 జనవరి 29 వరకు అందుబాటులో ఉంటాయని బాలు చౌదరి తెలిపారు. వార్షికోత్సవ ఆఫర్‌లో భాగంగా 20 చొప్పున మారుతి సుజుకి ఆల్టో కార్లు, బజాజ్‌ ప్లాటినా బైకులు, రిఫ్రిజిరేటర్లు, ఎసిలు, టివిలను విజేతాలకు అందించనున్నట్లు తొలుత ప్రకటించిన విషయం తెలిసిందే. మిగిలిన వాటి కోసం మరో దఫాలో లక్కీడ్రాను నిర్వహించనుంది.