బీఓబీ హిందీ దినోత్సవ వేడుకలు

హైదరాబాద్‌ : బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) తెలంగాణ సౌత్‌ రీజియన్‌ మంగళవారం ప్రపంచ హిందీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఉస్మానియా యూనివర్శిటీలోని హిందీ డిపార్ట్‌మెంట్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆ బ్యాంక్‌ తెలంగాణ సౌత్‌ రీజియన్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ రమేష్‌ కుమార్‌ గురజాపు పాల్గొని మాట్లాడారు. దీన్ని సీనియర్‌ మేనేజర్‌ ఒఎల్‌ అండ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ జి విజరు కుమార్‌ కో-ఆర్డినేట్‌ చేశారు.