బీసీ రాజకీయ రిజర్వేషన్లు చట్టబద్ధం చేయాలి : దాసు సురేశ్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
బీసీ ప్రధానమంత్రి మోదీ హాయాంలోనే బీసీలకు 27 శాతం రాజకీయ రిజర్వేషన్లను చట్టబద్దం చేయాలని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేశ్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం న్యూఢిల్లీలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశ నిర్మాతలు చేతి వృత్తిదారులంటూ ప్రధాని తన ప్రస్తావనలో గౌరవిస్తే సరిపోదని తెలిపారు. బ్రిటీష్‌ పాలనలో బీసీ కులాలకు దక్కిన గౌరవం స్వతంత్ర భారతదేశంలో కూడా లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి ఢిల్లీ కేంద్ర కమిటీ కన్వీనర్‌ ప్రకాష్‌ వర్మ తదితరులు పాల్గొన్నారు.