మహానటిని సినీ పరిశ్రమ కోల్పోయింది

ప్రజానాట్య మండలి రాష్ట్ర నాయకులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రముఖ సినీనటి, ప్రజానాట్యమండలి నాయకురాలు జమున మరణించడం సినీ పరిశ్రమకు కాదు.. యావత్తు ప్రజానీకానికీ తీరని లోటు అని ప్రజానాట్యమండలి రాష్ట్ర నాయకులు ఎన్‌.మారన్న అన్నారు. ప్రజానాట్యమండలి గ్రేటర్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఎస్వీకేలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళిలర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వామపక్ష భావజాలం కలిగిన ప్రజానాట్యమండలి వ్యవస్థాపకులు గరికపాటి రాజారావు ద్వారా కళా రంగంలోకి జమున అడుగు పెట్టారని గుర్తుచేశారు. అనేక భాషా చిత్రాల్లో నటించిన ఆమె మంచి పాత్రల ద్వారా ప్రజలకు చేరువయ్యారని, ఆమె మరణం కళా రంగానికి తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజానాట్యమండలి మా భూమి నాటకాన్ని ప్రదర్శించి అద్భుత నటిగా పేరుపొందారని, ఆ తర్వాత సినీ రంగంలో ప్రవేశించి హీరోయిన్‌ పాత్రలతో ప్రజల హృదయాన్ని గెలుచుకున్నారని తెలిపారు. సామాజిక కార్మిక సినిమాల్లో నటించి మంచి మనిషిగా పేరు తెచ్చుకున్న ఆమె ఈరోజు మనందరికీ దూరమైందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి గ్రేటర్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కమిటీ అధ్యక్షుడు బి.పవన్‌, సౌత్‌ జిల్లా కార్యదర్శి కళ్యాణ్‌, ప్రజా సంఘాల నాయకులు శశికళ, ఆర్‌. వెంకటేశ్‌, విజరు కుమార్‌, రాములు, పుల్లారావు, నరసింహ, కవిత తదితరులు పాల్గొన్నారు.