మార్కెట్‌ పనులను వేగవంతం చేయాలి

నవతెలంగాణ-దుండిగల్‌
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మరింత మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా పని చేస్తుందనీ, మార్కెట్‌ పనులను వేగవంతం చేయాలని మల్కాజిగిరి జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ అభిషేక్‌ అగస్త్య తెలిపారు. కుతుబుల్లాపూర్‌ నియోజకవర్గం దుండిగల్‌ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట్‌ లో ఇంటిగ్రేటెడ్‌ వెజ్‌, నాన్‌ వెజ్‌ మార్కెట్‌ జరుగుచున్న ఏర్పాట్లను శనివారం దుండిగల్‌ మున్సిపాలిటీ కమిషనర్‌ సత్యనారా యణతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులను వేగవంతం చేయాలని సూచించారు. అనంతరం దుండిగల్‌ తండా వద్ద గల రామ్‌కి (వేస్ట్‌ ప్రోసెసింగ్‌ యూనిట్‌) సందర్శించినారు. ఈ కార్యక్రమంలో కమిషనర్‌ కె.సత్యనారాయణ రావు, రెవెన్యూ ఆఫీసర్‌ బి.శ్రీహరి రాజు, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.