మీ విజయం యువతకు స్ఫూర్తిదాయకం

– త్రిష, యశశ్రీలతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ, హైదరాబాద్‌
‘మీ విజయం (త్రిష, యశశ్రీ) రాష్ట్ర యువతకు స్ఫూర్తిదాయకం. భారత జట్టు విజయంలో త్రిష వెన్నెముకలా నిలిచింది. తెలంగాణ బిడ్డలు దేశం గర్వపడే ప్రదర్శన చేశారు’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఐసీసీ అండర్‌-19 టీ20 ప్రపంచక ప్‌ విజేతలుగా నిలిచిన భారత జట్టులో సభ్యులైన తెలంగాణ క్రికెటర్లు గొంగడి త్రిష, యశశ్రీ సహా జట్టు ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ శాలినీల ను ఎమ్మెల్సీ కవిత శుక్రవారం తన నివాసంలో అభినందించారు. త్రిష, యశశ్రీలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం లభిస్తుందని, హెచ్‌సీఏ అధికారులు సైతం యువ క్రీడాకారిణీలకు అవసరైన సహాయ సహకారాలు అందించేలా చర్యలు తీసుకోవా లని సూచించారు. ఈ అభినందన కార్యక్రమ ంలో శాట్స్‌ చైర్మెన్‌ ఆంజనేయ గౌడ్‌, హెచ్‌సీఏ కార్యదర్శి ఆర్‌. విజయానంద్‌ సహా త్రిష, య శశ్రీ కుటుంబ సభ్యులు, కోచ్‌లు పాల్గొన్నారు.