యూనియన్‌ కార్యాలయంపై దాడికి ఎస్‌డబ్ల్యూఎఫ్‌ ఖండన

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
అగర్తలాలోని త్రిపుర మోటార్‌ శ్రామిక్‌ యూనియన్‌ కార్యాలయంపై బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ గూండాల దాడిని టీఎస్‌ఆర్టీసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌డబ్ల్యూఎఫ్‌) రాష్ట్ర కమిటీ, ఆల్‌ ఇండియా రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ తీవ్రంగా ఖండించాయి. కార్యాలయంపైకి దాడిచేసి, దోచుకోవడం హేయమైన చర్య అని పేర్కొన్నాయి. తక్షణం నిందితులను అరెస్టు చేసి వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. త్రిపురలో ప్రజలు, ఇండ్లు, కార్యాలయాలపై ఆర్‌ఎస్‌ఎస్‌-బీజేపీ గూండాలు జరిపిన దాడులపై తక్షణమే స్పందించి నిరసన తెలియజేయాలని అన్ని అనుబంధ సంఘాలకు ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్‌ లక్ష్మయ్య విజ్ఞప్తి చేశారు. దాడిని ఎస్‌డబ్ల్యూఎఫ్‌ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వీరాంజనేయులు, వీఎస్‌రావు, ప్రచార కార్యదర్శి పీ రవీందర్‌రెడ్డి ఖండించారు.

Spread the love