రాజకీయ వేదికలు వేరైనా.. వేడుకల్లో కలుసిపోతారు

– శుభకార్యంలో పాల్గొన్న తుమ్మల,తాటి
నవతెలంగాణ – అశ్వారావుపేట
రాజకీయ వేదికలు ఏవైనా వేడుకల్లో మాత్రం నాయకులు ఒకే వేదిక పైకి రావాల్సిందే.శుభకార్యాల ప్రాధాన్యం కూడా అదే. బంధువులు, మిత్రులలో సైతం వ్యాపార,వ్యవహార విభేదాలు, భేదాభిప్రాయాలు ఉన్నప్పటి శుభకార్యాల్లో అవి అన్నీ మార్చి ఆ కొంచెం సేపు ఐక్యంగా కనిపిస్తారు. రాజకీయ పట్టింపులు తో ఓ పార్టీ నాయకుడు వచ్చిన వేడుకకు మరో పార్టీ నాయకుడు హాజరు కానీ ఈ తరుణంలో నూ ఇటువంటి సందర్భాలు కాస్తా ఆలోచింప జేస్తాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజక వర్గం, దమ్మపేట మండలం గుత్తావారి గూడెంలో గురువారం జరిగిన ఓ వేడుకలో మాజీ మంత్రి,ప్రస్తుత బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తుమ్మల నాగేశ్వరరావు, తెలుగుదేశం హయాంలో తుమ్మల శిష్యరికం లోనే రాజకీయ ఆరంగేట్రం చేసి, ఎమ్మేల్యే గా పని చేసి, అనంతరం వైఎస్ ఆర్ సిపి అశ్వారావుపేట ఎమ్మెల్యే గా విజయం సాధించి, అనంతర రాజకీయ పరిణామాల్లో తెరాస లో చేరి, ప్రస్తుతం కాంగ్రెస్ నాయకుడుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కలుసుకున్నారు. ఇదే గ్రామానికి చెందిన గుత్తా రాజా సోదరుని కుమార్తె నీలిమ నిశ్చితార్థ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.