రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. నలుగురికి గాయాలు

నవతెలంగాణ – జనగామ
జనగామ జిల్లా రఘునాథపల్లి వద్ద పెను ప్రమాదం తప్పింది. సోమవారం ఉదయం రఘునాథపల్లి వద్ద రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. దీంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ప్రాయాణికులను ఇతర వాహానాల్లో వారి గమ్యస్థానాలకు పంపించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.