రైతుల సమస్యలు పరిష్కరించడంలో వ్యవసాయ అధికారులు ముందుండాలి

నవతెలంగాణ-భిక్కనూర్
రైతుల సమస్యలు పరిష్కరించడంలో వ్యవసాయ అధికారులు గ్రామాలలో పర్యటించి సమస్యలు తెలుసుకోవాలని ఎంపీపీ గాల్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ నరసింహారెడ్డి లు వ్యవసాయ అధికారులకు సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని స్థానిక రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన 2023 నూతన సంవత్సరపు క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సర్పంచ్ తునికి వేణు, మార్కెట్ కమిటీ చైర్మన్ భగవంతు రెడ్డి, రైతుబంధు మండల కన్వీనర్ రామచంద్రం, రామేశ్వర్ పల్లి సొసైటీ చైర్మన్ భూమిరెడ్డి, మండల వ్యవసాయ అధికారి రాధా, వ్యవసాయ విస్తీర్ణ అధికారులు రజిత, వినోద్, అఖిలేష్, ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.